భారత్‌లో కరోనా మరణ మృదంగం.. 50 వేలకు చేరువలో మరణాలు..!

Sunday, August 16th, 2020, 12:30:58 PM IST

భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గత 12 రోజులుగా ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ టాప్‌ ప్లేస్‌లో ఉండగా, మరణాల సంఖ్య 50 వేలకు చేరువయ్యింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 63,490 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటి వరకు మొత్తం 25,89,682 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం అందులో 6,77,444 యాక్టివ్ కేసులు ఉండగా, 18,62,258 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 944 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 49,980కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 7,46,608 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 71.9 శాతం ఉండగా, మరణాల రేటు 1.9 శాతంగా ఉంది.