కరోనా అప్డేట్: భారత్‌లో 65 వేలు దాటిన కరోనా మరణాలు..!

Tuesday, September 1st, 2020, 11:30:48 AM IST

india_corona

భారత్‌లో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 కొత్తగా 69,921 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 36,91,166 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 7,85,996 యాక్టివ్ కేసులు ఉండగా, 28,39,882 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 819 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 65,288 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 10,16,920 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 76.09 శాతం ఉండగా, మరణాల రేటు 1.8 శాతంగా ఉంది.