భారత్‌లో లక్ష దాటిన కరోనా మరణాల సంఖ్య..!

Saturday, October 3rd, 2020, 12:58:48 PM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ వస్తున్నా మరణాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. రోజుకు వెయ్యికి పైగానే మరణాల సంఖ్య నమోదవుతుండడంతో కరోనా మరణాల సంఖ్య లక్ష దాటింది. దీంతో కరోనా మరణాలలో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో 79,476 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో మరో 1,069 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 64,73,544 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,44,996 యాక్టివ్ కేసులు ఉండగా, 54,27,706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,00,846 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 75,628 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,32,675 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 83.8 శాతం ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.