భారత్ లో తగ్గుముఖం పట్టిన కరోనా మరణాల శాతం…ఎంతంటే!?

Sunday, July 19th, 2020, 09:05:47 PM IST

india_corona

కరోనా వైరస్ మహమ్మారి ఒక్క భారత దేశాన్ని మాత్రమే కాదు, ప్రపంచ దేశాలను సైతం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. అయితే భారత్ నమోదు అవుతున్న గణాంకాలు దేశ ప్రజలను భయ బ్రంతులకు గురి చేస్తున్నాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా భారత్ లో కరోనా వైరస్ మరణాల రేటు తగ్గింది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రపంచం లోనే అత్యల్పం గా కరోనా వైరస్ మరణాల రేటు 2.5 దిగువ శాతానికి పడిపోయింది అని తెలిపింది. భారీ సంఖ్యలో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించడం మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా భారత్ లో కరోనా వైరస్ మరణాల రేటు తగ్గింది అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మరణాల రేటు 2.49 శాతానికి పడుపోయింది అని తెలిపింది. అయితే భారత్ లో 24 గంటల్లో 38 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 543 మంది మరణించారు. భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 10,77,618 కాగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 26,816 కి చేరింది.