కరోనా అప్డేట్: భారత్ లో తగ్గిన మరణాల రేటు

Tuesday, August 25th, 2020, 10:34:05 PM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా కరోనా వైరస్ ద్వారా సంభవించే మరణాల రేటు తగ్గింది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచం లోనే అత్యల్పం గా భారత్ లో కరోనా వైరస్ మరణాల రేటు ఉంది అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్ లో 1.58 శాతంగా కరోనా వైరస్ మరణాల రేటు ఉందని తెలుస్తోంది. అయితే ఈ మేరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

గడిచిన 24 గంటల్లో 6400 కేసులు తగ్గినట్లు తెలిపారు అధికారులు. అయితే దేశంలో 22 శాతం పాజిటివ్ కేసులు మాత్రమే యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే రికవరీ రేటు 75.92 శాతానికి చేరింది అని అధికారులు తెలిపారు. భారత్ లో గడిచిన 24 గంటల్లో 66,500 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకోవడం జరిగింది. అయితే రికవరీ రేటు పెరగడం, మరణాల రేటు తగ్గడం భారీ ఊరట కలిగించే అంశాలు అని చెప్పాలి. మరో పక్క అన్ లాక్ 4 మొదలు అయ్యే అవకాశాలు ఉండటం తో ప్రజలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.