భారత్‌లో క్రమక్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Monday, October 5th, 2020, 12:11:03 PM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా ఇప్పుడు అది కాస్త 70 నుంచి 80 వేల మధ్య ఉంటుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో 74,442 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో మరో 903 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 66,23,815 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,34,427 యాక్టివ్ కేసులు ఉండగా, 55,86,703 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,02,685 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 76,737 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 9,89,860 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 84.3 శాతం ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.