గుడ్‌ న్యూస్ : భారత్‌లో కాస్త తగ్గుతున్న కరోనా కేసులు..!

Tuesday, August 18th, 2020, 11:40:28 AM IST

india_corona

భారత్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ టాప్‌ ప్లేస్‌లో ఉండగా ఇప్పుడు కాస్త అది తగ్గుతూ వస్తుంది. అయితే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,079 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటి వరకు మొత్తం 27,02,742 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం అందులో 6,73,166 యాక్టివ్ కేసులు ఉండగా, 19,77,779 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 876 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 51,797కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 8,99,864 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 73.2 శాతం ఉండగా, మరణాల రేటు 1.9 శాతంగా ఉంది.