బ్రేకింగ్ : ఏపీలో తగ్గని కరోనా..మళ్ళీ భారీ కేసులు.!

Tuesday, June 2nd, 2020, 11:54:26 AM IST

ఏపీలో కరోనా పరుగులు పెడుతుంది లాక్ డౌన్ పెరుగుతున్న కొద్దీ దేశంతో పాటూ మన దగ్గర కూడా ఊహించని రీతిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. జనం ఇళ్లలో ఉండలేక కరోనాతో సహజీవనం చెయ్యడానికి కూడా రెడీ అయ్యిపోయారు.

ఇక కరోనా కూడా స్పీడ్ పెంచింది. గత కొన్ని రోజుల వరకు ఏపీలో నెమ్మదించిన కరోనా ఇప్పుడు స్పీడ్ పెంచింది. మొన్ననే 100 కు చేరువై అదే హవా కొనసాగిస్తోంది. గడిచిన 24 గంటల్లో మరోసారి భారీగా కేసులు నమోదు అయ్యినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వారు తెలియజేసారు.

మొత్తం 12 వేల 613 శాంపిల్స్ పరీక్షించగా అందులో 82 పాజిటివ్ తేలాయి. దీనితో ఏపీలో మొత్తం 3200 కేసులు నమోదు అయ్యాయి. ఇన్ని జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం జిల్లాల వారీగా సమాచారాన్ని ఇంకా గోప్యంగా ఉంచడం గమనార్హం.