భారత్‌లో 50 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. నేడు కొత్తగా ఎన్నంటే?

Tuesday, September 15th, 2020, 11:03:56 AM IST

భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా జరుగుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 83,809 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,30,236 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,90,061 యాక్టివ్ కేసులు ఉండగా, 38,59,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,054 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 80,776 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 79,292 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,72,845 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 78.28 శాతం ఉండగా, మరణాల రేటు 1.64 శాతంగా ఉంది.