హైదరాబాద్‌లో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యిందా?

Monday, December 7th, 2020, 11:14:06 PM IST

ప్రపంచ దేశాలను దాదాపు ఏడాది కాలంగా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య కాస్త తగ్గిందని అనుకునేలోపే మళ్ళీ సెకండ్ వేవ్ భయం వెంటాడుతుంది. ఇప్పటికే పలు దేశాలలో కరోనా సెకండ్ వేవ్ కూడా ప్రారంభమయ్యింది. అయితే మన దేశంలో కూడా ఇప్పటికే ఒకసారి కరోనా బారిన పడిన వారు మళ్ళీ రెండో సారి కరోనా బారిన పడుతున్న కేసులు పెరుగుతున్నాయి.

అయితే తాజాగా హైదరాబాద్‌లో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతుంది. ఎస్‌ఆర్‌నగర్‌ పీఎస్‌లో మళ్లీ కరోనా కేసులు నమోదవ్వడంతో అటు పోలీసులు, ఇటు ప్రజలు భయపడిపోతున్నారు. నలుగురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లకు అలాగే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అయితే వీరికి జూన్ నెలలో కూడా కరోనా సోకిందని మళ్ళీ ఇప్పుడు రెండో సారి కరోనా బారిన పడినట్టు సమాచారం. అయితే మొదటి విడతలో జాగ్రత్తలు పాటించినప్పటికీ, రెండో విడతలో మాత్రం అందరూ నిర్లక్ష్యం వహిస్తుండడంతోనే మళ్ళీ కరోనా బారిన పడుతున్నట్టు సమాచారం.