భారత్‌లో 42 లక్షలు దాటిన కరోనా కేసులు.. నేడు కొత్త కేసులు ఎన్నంటే?

Monday, September 7th, 2020, 11:53:53 AM IST

india_corona

భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 ఏకంగా 90,802 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,04,613 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 8,82,542 యాక్టివ్ కేసులు ఉండగా, 32,50,429 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1016 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 71,642 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 69,564 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 7,20,362 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 77.3 శాతం ఉండగా, మరణాల రేటు 1.7 శాతంగా ఉంది.