కరోనా అప్డేట్: భారత్‌లో 40 లక్షలు దాటిన కరోనా కేసులు..!

Saturday, September 5th, 2020, 02:18:33 PM IST

india_corona

భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 ఏకంగా 86,432 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,23,179 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 8,46,395 యాక్టివ్ కేసులు ఉండగా, 31,07,223 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1089 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 69,561 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 70,072 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,59,346 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 77.2 శాతం ఉండగా, మరణాల రేటు 1.7 శాతంగా ఉంది.