భారత్‌లో 26 లక్షలు దాటిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..!

Monday, August 17th, 2020, 11:14:45 AM IST

భారత్‌లో గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే గత 12 రోజులుగా ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ టాప్‌ ప్లేస్‌లో కొన్సాగుతుండగా నేడు కూడా అదే రికార్డ్ రిపీట్ అయ్యింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 57,981 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటి వరకు మొత్తం 26,47,663 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం అందులో 6,76,900 యాక్టివ్ కేసులు ఉండగా, 19,19,842 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 941 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 50,921కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 7,31,697 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 72.5 శాతం ఉండగా, మరణాల రేటు 1.9 శాతంగా ఉంది.