భారత్‌లో 69 లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Friday, October 9th, 2020, 10:15:18 AM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా, వెయ్యికి పైగా మరణాలు నమోదు అయ్యేవి. అయితే ఇప్పుడు అది కాస్త తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 70,496 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 964 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 69,06,151 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 8,93,592 యాక్టివ్ కేసులు ఉండగా, 59,06,069 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,06,490 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 78,365 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,68,705 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 85.5 శాతం ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.