భారత్‌లో 67 లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Wednesday, October 7th, 2020, 10:37:06 AM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా, వెయ్యికి పైగా మరణాలు నమోదు అయ్యేవి. అయితే ఇప్పుడు అది కాస్త తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 72,049 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 986 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 67,57,131 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,07,883 యాక్టివ్ కేసులు ఉండగా, 57,44,693 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,04,555 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 82,203 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,99,857 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 85.0 శాతం ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.