కరోనా అప్డేట్: భారత్‌లో 58 లక్షలు దాటిన కరోనా కేసులు..!

Friday, September 25th, 2020, 10:30:10 AM IST

భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 86,052 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,18,570 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,70,116 యాక్టివ్ కేసులు ఉండగా, 47,56,164 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,141 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 92,290 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 81,177 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 14,92,409 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 81.7 శాతం ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.