భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. 48 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..!

Monday, September 14th, 2020, 11:11:19 AM IST

india_corona

భారత్‌లో అంతకంతకు కరోనా విజృంభిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా జరుగుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 92,071 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,46,427 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,86,598 యాక్టివ్ కేసులు ఉండగా, 37,80,107 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,136 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 79,722 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 77,512 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 9,78,500 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 78 శాతం ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.