భారత్‌లో 43 లక్షలు దాటిన కరోనా కేసులు.. నేడు కొత్త కేసులు ఎన్నంటే..!

Wednesday, September 9th, 2020, 10:40:31 AM IST

india_corona

భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో 89,706 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 43,70,128 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 8,97,394 యాక్టివ్ కేసులు ఉండగా, 33,98,884 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,115 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 73,890 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 74,894 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,54,549 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 77.77 శాతం ఉండగా, మరణాల రేటు 1.69 శాతంగా ఉంది.