తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా నేడు ఎన్నంటే?

Monday, October 5th, 2020, 09:41:49 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతంది. గత కొద్ది రోజులుగా రోజుకు 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా మూడు రోజుల నుంచి రెండు వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో కేవలం 1,335 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా నేడు మరో 8 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,176 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,00,611 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,72,388 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 27,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,171 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 36,348 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 32,41,597 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 85.93 శాతం ఉండగా, మరణాల రేటు 0.58% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.