భారత్‌లో 18 లక్షలు దాటిన కరోనా కేసులు..!

Monday, August 3rd, 2020, 11:42:12 AM IST

భారత్‌లో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో 52,972 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటి వరకు మొత్తం 18,83,695 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం అందులో 5,79,357 యాక్టివ్ కేసులు ఉండగా, 11,86,203 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏకంగా 771 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 38,135 చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 3,81,027 కరోనా టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 2,02,02,858 కి చేరింది. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 65.8గా ఉంది.