బిగ్ బ్రేకింగ్ : తెలంగాణాలో నిలకడగా కరోనా కేసులు..తాజా లెక్కలు ఇవే.!

Sunday, August 9th, 2020, 11:32:42 AM IST

తెలంగాణాలో ఇప్పుడు కరోనా ప్రభావం అలా నిలకడగా కొనసాగుతుంది అని చెప్పాలి. తెలంగాణలో ఇప్పటికే భారీ ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు లేటెస్ట్ గా అక్కడ నమోదు అయ్యిన కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 22 వేల 925 టెస్టులు చెయ్యగా అందులో మొత్తం 1982 కేసులు నమోదు అయ్యాయి.

గడిచిన ఈ నాలుగు రోజుల్లో చేసిన పరీక్షలతో పోలిస్తే ఇప్పుడు నమోదు అయ్యిన కేసులు స్వల్పంగా తక్కువ వచ్చాయని అని చెప్పాలి. అలాగే గత 24 గంటల్లోనే మొత్తం 1669 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 12 మంది మృతి చెందారు. జిహెచ్ఎం పరిధిలో 463 కేసులు నమోదు కాగా మేడ్చల్ మల్కాజ్ గిరిలో 141 కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 139 కేసులు నమోదు అయ్యాయి. ఈసరికొత్త కేసులతో తెలంగాణలో మొత్తం 79 వేల 495 కేసులు నమోదు అయ్యాయి.