కరోనా అప్డేట్: భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు..!

Tuesday, October 6th, 2020, 11:44:32 AM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా, వెయ్యికి పైగా మరణాలు నమోదు అయ్యేవి. అయితే ఇప్పుడు అది కాస్త తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 61,267 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 884 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 66,85,082 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,19,023 యాక్టివ్ కేసులు ఉండగా, 56,62,490 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,03,569 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 75,787 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,89,403 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 84.7 శాతం ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.