24 గంటల్లో తెలంగాణ కి 318 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ సరఫరా!

Sunday, May 9th, 2021, 09:08:33 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం తో అధికారులు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ రోగులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. అయితే గత 24 గంటల్లో 318 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ ను ఒడిశా నుండి రాష్ట్రానికి తీసుకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మరో 144 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తిలో ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ఆక్సిజన్ రవాణా ను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, రవాణా శాఖ కమీషనర్ ఎం ఆర్ ఎం రావు ఇతర ముఖ్య అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ఖాళీ ట్యాంకర్ లని సనత్ నగర్ రైల్వే స్టేషన్ నుండి ఒడిశా కి పంపుతున్నట్లు చెప్పుకొచ్చారు. అదే విధంగా మరో 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రెండు ట్యాంకర్ లను సైనిక రవాణా విమానాల ద్వారా పంపుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో కరోనా వైరస్ మరణాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.