మోడిని పొగుడుతున్న కాంగ్రెస్ నేతలు – ఆత్మరక్షణలో కాంగ్రెస్

Friday, January 23rd, 2015, 03:39:33 PM IST


130సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఆపార్టీకి చెందిన చాలా మంది నేతలు బీజేపి వైపు చూస్తున్నారు. అంతేకాదు, చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని, కాంగ్రెస్ కు వీరవిధేయులుగా ఉన్న నాయకులు చాలా మంది ఇప్పటికే ప్లేట్ ఫిరాయించి, అదును చూసి కాంగ్రెస్ నుంచి బీజేపిలోకి దూకుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కావూరి సాంబశివ రావు, కన్నా లక్ష్మినారాయణలు బీజేపిలో చేరారు. కాంగ్రెస్ నుంచి మరికొంత మంది నేతలు బీజేపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు.

ఇక ఇది ఇలా ఉంటే, దేశ రాజకీయాల్లో సోనియా గాంధికి అత్యంత ఆప్తుడు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జనార్ధన్ ద్వివేది మోడీని పొగడటంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. భారతీయతకు దేశ ప్రజలు ఓట్లు వేసారని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఖంగుతిన్నది. బీజేపి గెలుపొందిన అనంతరం ఇది బీజేపి, మోడీ గెలుపు కాదని భారతీయత గెలుపని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విషయాన్నీ… కాంగ్రెస్ సీనియర్ నేత జనార్ధన్ త్రివేది చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ సీరియస్ అవుతున్నది. వెంటనే జనార్ధన్ త్రివేదిపై చర్యలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమయింది. ఆయనపై వేటు వేయాలని పార్టీ నిర్ణయించింది.