బిగ్ న్యూస్: గ్రేటర్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ దూకుడు… ఇన్ ఛార్జ్ ల నియామకం

Tuesday, November 17th, 2020, 02:36:45 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం తో తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ పార్టీలు ఇందుకు సమాయత్తం అవుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ విషయం లో దూకుడు గా వ్యవహరిస్తుంది. పార్లమెంట్ నియోజక వర్గాల వారికీ టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీలను ప్రకటించారు. అయితే బల్దియా పరిధిలోకి వచ్చే హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, చేవెళ్ల మరియు మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా ఇన్ ఛార్జ్ లను నియమించడం జరిగింది.

అయితే హైదరాబాద్ పార్లమెంట్ కి షబ్బీర్ అలీ, సికంద్రబాడ్ కి భట్టి విక్రమార్క, చేవెళ్లకు పొన్నం ప్రభాకర్,మల్కాజ్ గిరి కి జీవన్ రెడ్డి, మెదక్ కి కుసుమ కుమార్ లను నియమించారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు ప్రచార కమిటీ ను, పోల్ మేనేజ్మెంట్ ను పార్టీ నేతలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపటి లోగా అభ్యర్ధులను ఖరారు చేయనుంది కాంగ్రెస్ పార్టీ. ఖరారు అయిన అభ్యర్థులకు 19 వ తేదీన బీ ఫాం అందించనున్నారు ఉత్తమ్ కుమార్. ఈ నెల 21 న కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేనిఫెస్టో ను విడుదల చేయనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.