తిరుమల వేంకటేశ్వర స్వామి జోలికి వెళ్లి తప్పు చేయొద్దు – వీహెచ్

Monday, October 19th, 2020, 07:27:38 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై వరుస విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుమల శ్రీవారి కి చెందిన బంగారం ను కుడువపెట్టి నిధులు సేకరించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నేత వీ హెచ్ హనుమంత రావు స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అలా నిధులు సేకరించాలనే ఆలోచన తగదు అని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో వీ హెచ్ హనుమంత రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తిరుమల శ్రీవారి జోలికి వెళ్లి తప్పు చేయొద్దు అని హితవు పలికారు. భక్తుల హృదయాలను బాధ పెట్టొద్దు అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ను కోరారు. వేంకటేశ్వరుడు వడ్డీ కాసుల వాడు అని, ఆయన జోలికి వెళ్తే వడ్డీతో సహా వసూలు చేస్తాడు అని హెచ్చరించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం విషయంలో పీఠాధిపతులు సైతం స్పందించడానికి భయపడుతున్నారు అని తెలిపారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి నేరుగా న్యాయ వ్యవస్థ పై మాట్లాడటం తో జనాలకు భయం పట్టుకుంది అని, తమ మనోభావాలు వెల్లడించేందుకు జంకుతున్నారు అంటూ వీ హెచ్ హనుమంత రావు వ్యాఖ్యానించారు.