తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ మహమ్మారి భారిన పడి కోలుకున్నారు. అయితే దీని ప్రభావం ప్రతి ఒక్కరి పై కూడా ఉందనున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ కీలక నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరోనా వైరస్ భారిన పడ్డారు. ఇటీవల కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఇటీవల తనని కలిసిన వారు, సన్నిహితంగా ఉన్నవారు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.
అయితే కరోనా వైరస్ సోకినప్పటికి లక్షణాలు అంతగా లేకపోవడం తో స్వీయ నిర్బంధం లో ఉంటున్నట్లు తెలిపారు. అయితే తెలంగాణ లో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉండటం, ఇందుక్ వాక్సిన్ ఇంకా అందుబాటు లో లేకపోవడం తో ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.