దుబ్బాక లో సానుభూతితో రఘునందన్ రావు గెలిచాడే తప్ప బీజేపీ గెలవలేదు

Wednesday, November 11th, 2020, 06:54:25 PM IST

తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక ఉపఎన్నిక సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఓడించి, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. అయితే టీఆర్ఎస్ ఓటమికి గల కారణాలు ఏవైనా, బీజేపీ మాత్రం ఇక తన సత్తా తెలంగాణ లో చాటుతోంది అంటూ బీజేపీ నేతలు అంటున్నారు. అయితే ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఈ ఉప ఎన్నిక గెలుపు విషయం లో పలు వ్యాఖ్యలు చేశారు.

అయితే దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఒడిపోవాలనే కసితో బీజేపీ కి ప్రజలు ఓట్లు వేశారు అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే తెరాసలోకి పోతాడు అని బీజేపీ దుష్ప్రచారం చేసింది అని తెలిపారు. అందుకే బీజేపీ అక్కడ గెలిచింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉపఎన్నిక లో సానుభూతి తో రఘునందన్ రావు గెలిచాడే తప్ప, బీజేపీ గెలవలేదు అని పేర్కొన్నారు. పొన్నాల లక్ష్మయ్య సైతం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రం లో నియంతృత్వ సాగు విధానం తీసుకు రావడం తో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని, వారి ఉసురు తగులుతుంది అంటూ దారుణ విమర్శలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి.