తెలంగాణ వచ్చి ఆరేళ్లు అయినా పేదలకు న్యాయం జరగలేదు – వీహెచ్

Tuesday, October 13th, 2020, 12:17:58 PM IST

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మరోసారి నిప్పులు చెరిగారు. దుబ్బాకలో ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీహెచ్ టీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అందరూ అనుకున్నారని, తెలంగాణ వచ్చి ఆరేళ్లు అయినా సీఎం కేసీఆర్ కుటుంబానికి తప్పా పేదవాళ్లకు న్యాయం జరగలేదని అన్నారు.

అయితే దుర్మార్గపు పనులు చేసేవారు, పేదలను మోసం చేసేవారిని అంతం చేసేందుకు తెలంగాణలో నక్సలైట్లు బయటకు వస్తున్నారని, ఇటీవలే ఓ టీఆర్ఎస్ నేతను కూడా చంపేశారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో నక్సలైట్లు కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారని, కానీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా పేదవాళ్లకు న్యాయం జరగలేదని, అందుకే నక్సలైట్లు మళ్లీ వస్తున్నారని ఇక దుర్మార్గులు, అవినీతిపరుల అంతుచూస్తారని అన్నారు.