అనారోగ్యం తో మాజీ ముఖ్యమంత్రి మృతి

Monday, December 21st, 2020, 05:20:24 PM IST

మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరా కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆదివారం రాత్రి పూట ఢిల్లీ లోని ఒక ఆసుపత్రి లో చికిత్స నిమిత్తం చేరగా, సోమవారం నాడు కన్నుమూశారు. అయితే వొరా ఆదివారం నాడు తన 93 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అయితే ముఖ్యమంత్రి చనిపోయిన విషయాన్ని మీడియా వర్గాలు వెల్లడించడం తో ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గత అక్టోబర్ లో కొవిడ్ భారిన పడిన ఈయన చికిత్స తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలువురు నేతలు ఇప్పటికే అనారోగ్యం భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. మాజీ ముఖ్యమంత్రి వోరా మృతి తో కాంగ్రెస్ కి చెందిన పలువురు నేతలు సంతాపం తెలిపారు.