కాంగ్రెస్ పార్టీ బలహీనం కాలేదు – జగ్గారెడ్డి

Wednesday, December 9th, 2020, 10:00:19 PM IST

కాంగ్రెస్ పార్టీ గురించి ఇతర పార్టీలు చేస్తున్న విమర్శల పట్ల జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలహీనం కాలేదు అని, సంస్థాగతంగా ఇంకా బలంగా ఉంది అని జగ్గారెడ్డి తెలిపారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి టిపిసిసి పదవి కి రాజీనామా చేసిన తరువాత ఆ పదవి ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ పదవి కోసం అభిప్రాయ సేకరణ జరగడం దురదృష్ట కరం అని అన్నారు. అయితే ఈ సారి పిసిసి పదవి కోసం చాలా కాంపిటీషన్ ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

అయితే ఈ పిసిసి రేసు లో తనతో పాటుగా మరికొంత మంది ఉన్నారు అని జగ్గారెడ్డి తెలిపారు. అయితే అధిష్టానం ఈ పదవి లో ఒకరిని నియమించేందుకు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు పార్టీ ఇన్ ఛార్జ్ హైదరాబాద్ కి రానున్నారు అని, అయితే అభిప్రాయ సేకరణ అనంతరము మూడు లేదా నాలుగు రోజుల్లో పిసిసి చీఫ్ ను నియమించనున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ పదవి కోసం పలువురు నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.