రాంగోపాల్ వర్మకు కాంగ్రెస్‌ నేత వార్నింగ్.. మ్యాటరేంటంటే?

Friday, September 11th, 2020, 12:06:18 AM IST


వివాదస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మకు కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే సంపంత్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్‌పార్టీపై అవమానకంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నీ సినిమా కోసం కాంగ్రెస్‌పై ఇష్టమున్నట్టు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది జాగ్రత అని అన్నారు.

అయితే బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర మధ్య జరుగుతున్న వార్‌పై నిన్న ట్విట్టర్ ద్వారా స్పందించిన రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రకి కంగనా నెక్స్ట్ సీఎం అవుతుంది అంటూ అలానే ఆర్ణబ్ గోస్వామి పీఎం అయితే శివసేన కనుమరుగు అవుతుందని అన్నారు. అప్పుడు ముంబై పోలీసులు రిపబ్లిక్ టీవీ తో రీప్లేస్ అవుతారని కాంగ్రెస్ పార్టీ కాస్త ఇటలీకి పారిపోతుంది అంటూ సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.