పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా భట్టి సైకిల్ యాత్ర

Sunday, March 7th, 2021, 02:00:14 PM IST

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సామాన్య ప్రజలకు ఈ ధరలు పెరగడం తో మరింత కష్టతరం గా ఉందని ఇప్పటికే పలువురు కేంద్ర ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేత భట్టి విక్రమార్క ఇందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క సైకిల్ యాత్ర ను ప్రారంభించారు. భద్రాద్రి సీతారాముల వారిని దర్శించుకున్న అనంతరం భట్టి సైకిల్ యాత్ర ను ప్రారంభించారు. పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపునకు నిరసనగా సైకిల్ యాత్ర ను ప్రారంభించారు.అయితే ఈ యాత్ర భద్రాచలం నుండి ఖమ్మం వరకూ కొనసాగనుంది. ఈ యాత్ర లో కాంగ్రెస్ పార్టీ నేతలు అయిన బలరాం నాయక్, రాములు నాయక్, జీవన్ రెడ్డి లు పాల్గొన్నారు.