పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..!

Wednesday, February 10th, 2021, 12:54:13 AM IST


తెలంగాణలో త్వరలో పట్టభద్రుల ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి మరియు మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే ఇప్పటికే పలు పార్టీల నేతలు ఎన్నికల బరిలో నిలవడానికి సిద్దమయ్యారు. ఇటీవల అధికార టీఆర్ఎస్ పార్టీ వరంగల్, ఖమ్మం, నల్గొండ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ప్రకటించగా, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి స్థానానికి ఇంకా అభ్యర్థి పేరును ఖరారు చేయలేదు.

తాజాగా ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మాజీ మంత్రి చిన్నారెడ్డి, రాములు నాయక్‌ పేర్లను అధికారికంగా వెల్లడించింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ అభ్యర్థిగా రాములు నాయక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి అభ్యర్థిగా చిన్నారెడ్డి పేర్లును కాంగ్రెస్ ప్రకటించింది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.