కరోనా తో పోరాడుతూ కాంగ్రెస్ ఎంపీ మృతి!

Friday, August 28th, 2020, 08:39:44 PM IST


కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో ఏ ఒక్కరినీ కూడా వదిలి పెట్టడం లేదు. రోజుకి వందల సంఖ్యలో కరోనా వైరస్ భారిన పడి బాధితులు ప్రాణాలను కోల్పోతున్నారు. వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు అవుతుంది. అయితే ఈ మహమ్మారి భారిన పడి కాంగ్రెస్ పార్టీ చెందిన ఎంపీ హెచ్ వసంత్ కుమార్ ప్రాణాలను కోల్పోయారు.

కరోనా వైరస్ లక్షణాలు ఉండటం తో ఈ నెల 10 వ తేదీన చెన్నై లోని అపోలో ఆస్పత్రి కి తరలించారు. అయితే మూడు వారాల పాటు గా కరోనా వైరస్ తో పోరాడిన ఆయన నేడు సాయంత్రం 6:56 గంటలకు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే తమిళ నాడు కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నేత కరోనా సోకి మృతి చెందడం పట్ల ప్రజలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.