సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి లేఖ.. ఏం కోరారంటే..!

Sunday, October 11th, 2020, 01:25:44 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌కి వ్యవసాయ, ఎల్‌ఆర్‌ఎస్ బిల్లులపైకాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు వలన రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని అన్నారు.

అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయని, తెలంగాణ రాష్ట్రం కూడా వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని అన్నారు. సామాన్యుడికి పెనుభారంగా మారిన ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. అవసరమైతే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని, సాధ్యం కాని పక్షంలో ఎటువంటి ఫీజులు లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయలని లేఖలో పేర్కొన్నారు.