వామనరావు దంపతుల హత్య తెరాస అంతానికి నాంది – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Tuesday, March 2nd, 2021, 03:03:27 AM IST


హైకోర్ట్ న్యాయమూర్తి వామనరావు దంపతుల హత్య ముమ్మాటికి అధికార పార్టీ హత్యేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తుగా వ్యవహరించడం, పోలీసుల నిర్లక్ష్యం వల్లే వలనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. ఈ హత్యక వెనుక ఉన్న అసలైన సూత్రధారులు ఎవరో బయటకు రావాలని అన్నారు. పుట్ట మధు మేనల్లుడి పుట్ట లింగమ్మ ట్రస్ట్ కార్యకలాపాలకు అడ్డుతగిలాడనే వామనరావు దంపతులను హత్య చేశారని అన్నారు.

అయితే ఈ కేసులో పుట్ట మధు పాత్రపై విచారణ చేయాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నట్టు జీవన్ రెడ్డి అన్నారు. వామనరావు దంపతుల హత్య ఆనాడు జరిగ్న వంగవీటి మోహన రంగ హత్యను గుర్తుకు తెస్తుందని, ఆనాటి హత్య తెలుగుదేశం అంతానికి కారణం కాగా, ఈ నాటి వామనరావు దంపతుల హత్య తెరాస అంతానికి నాందిగా తాను భావిస్తున్నానని జీవన్ రెడ్డి అన్నారు. అయితే ఈ కేసును సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో కేసు విచారణ జరిపించాలని ఆయన కోరారు.