సీఎం అయ్యేందుకు కేటీఆర్ సమర్ధుడే.. జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Thursday, February 4th, 2021, 11:01:38 PM IST

తెలంగాణకు కొత్త సీఎం కేటీఆర్ కాబోతున్నారంటూ వస్తున్న వార్తలపై మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే కేటీఆర్‌కు సీఎం కావడానికి అవకాశం ఉండవచ్చని అన్నారు. సీఎం అయ్యేందుకు కేటీఆర్ సమర్థుడే అయినా సీఎం కేసీఆర్ కుమారుడనే వారసత్వ ముద్ర ఆయనపై ఉందని అన్నారు. అయితే కేటీఆర్‌కు బదులు ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం చేస్తే పార్టీలో అంతా ఏకాభిప్రాయంతో ఉంటారని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే పసుపు కొనుగోలు కేంద్రాలు, గిట్టుబాటు ధర కల్పించాలని తాను సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం రైతులు ఉద్యమిస్తుంటే ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడం లేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. తనను ఎంపీగా గెలిపిస్తే 100 రోజులలో పసుపు బోర్డు తెస్తానన్న ధర్మపురి అరవింద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని, అసలు పసుపు బోర్డు ఊసెత్తడం లేదని అన్నారు.