ప్రగతి భవన్ ఏమైనా కేసీఆర్‌ అయ్య జాగీరా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఫైర్..!

Monday, October 5th, 2020, 07:26:47 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గ సమస్యలు చెప్పేందుకు ఈ రెండు సంవత్సరాలలో 200 సార్లు సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ అడిగినా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్‌ ఏమైనా కేసీఆర్‌ అయ్య జాగీరా అని ప్రశ్నించారు.

అయితే సీఎం కేసీఆర్‌కు కేవలం ఆయన నియోజకవర్గం గజ్వేల్‌, కుమారుడి నియోజకవర్గం సిరిసిల్ల, అల్లుడి నియోజకవర్గం సిద్దిపేట రాష్ట్రంలో ఈ మూడు నియోజకవర్గాలే ఆయనకు కనిపిస్తున్నాయని, మిగతా నియోజకవర్గాలు కన్పించడం లేదా అని నిలదీశారు. మంత్రి కేటీఆర్‌కు కూడా సిరిసిల్ల నియోజకవర్గ చేనేత కార్మికులే కనిపిస్తున్నారు తప్ప ఇతర నియోజకవర్గ కార్మికులు అసలు కనిపించడం లేదని ఎప్పుడెప్పుడు సీఎం కావాలని కేటీఆర్ ఆరాటపడుతున్నాడని అన్నాడు.