మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు – జగ్గారెడ్డి

Tuesday, May 18th, 2021, 09:33:03 PM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ప్రకటించడం చాలా సంతోషమని, సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని జగ్గారెడ్డి అన్నారు. తనకు అపాయింట్మెంట్ ఇస్తే సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియచేస్తానని పేర్కొన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కోసం తాను ఎంతో పోరాటం చేశానని, తన కూతురుతో కలిసి ట్యాంక్‌బండ్ నుంచి అసెంబ్లీకి పాదయాత్ర చేశానని ఈ సందర్భంగా జగ్గారెడ్డి గుర్తుచేసుకున్నారు. అయితే దాదాపు 10 నియోజకవర్గాల ప్రజలతో పాటు భీదర్ నుండి వచ్చే ప్రజలకు కూడా సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఎంతో ఉపయోగపడుతుందని జగ్గారెడ్డి అన్నారు.

అయితే సీఎం కేసీఆర్ వెంటనే మెడికల్ కాలేజ్‌కు వెయ్యి కోట్లు కేటాయించాలని జగ్గారెడ్డి కోరారు. అంతేకాదు మెడికల్ కాలేజీ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి సీఎం శంకుస్థాపన చేయాలని ఎమ్మెల్యేగా తనకు సీఎంగా కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని అన్నారు. ఐతే శంకుస్థాపనకు వచ్చిన రోజు సీఎం కేసీఆర్‌కు భారీ సన్మానం చేస్తానని ఇది పార్టీతో సంబంధం లేదని నా వ్యక్తిగతమని జగ్గారెడ్డి అన్నారు.