మేము ఆరుమందిమే.. టీఆర్ఎస్‌పై జగ్గారెడ్డి సీరియస్ కామెంట్స్..!

Wednesday, September 23rd, 2020, 08:52:12 PM IST

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని, ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలను మరింతగా తగ్గించాలని అన్నారు. అంతేకాదు ఎల్‌ఆర్‌ఎస్‌ గడువును ఏడాది పాటు పొడిగించాలని అన్నారు. మంత్రి తలసాని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, లక్ష డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు చూపిస్తానని 15 వేల ఇళ్లను కూడా చూపలేకపోయారని అన్నారు.

అయితే త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయని అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మీకు అభ్యర్థులు లేక తమ నేతలను చేర్చుకున్న విషయాన్ని గుర్తించుకోవాలని అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఎలా షాకిస్తారో తెలియదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌కు డబ్బు బలం ఉందని టీఆర్‌ఎస్‌ దగ్గర డబ్బు తీసుకొని కాంగ్రెస్‌కు ఓటేయాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మేము ఆరు మంది ఎమ్మెల్యేలమే కానీ 110 మంది ఎమ్మెల్యేలకు గట్టిగా జవాబిస్తున్నామని అన్నారు.