రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలనం..!

Sunday, December 13th, 2020, 03:00:44 AM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం పీసీసీ రగడ కొనసాగుతుంది. పీసీసీ కసరత్తు జరుగుతున్న నేపధ్యంలో చాలా మంది ఆశావాహులు తమకు పీసీసీ పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ రేసులో తాను ఉన్నానని ఇప్పటికే చాలా సార్లు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా పాదయాత్ర చేస్తానని ప్రకటించాడు.

అయితే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ మాట విని సన్నవడ్లు పండించిన రైతులు అప్పుల పాలయ్యారని పాదయాత్రలో ప్రతి రైతును కలిసి వారి సమస్యలపై పోరాడుతానని అన్నారు. తన పాదయాత్ర సంగారెడ్డి నుండి ఆదిలాబాద్ వరకు జరగుతుందని, త్వరలో పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను కూడా ప్రకటిస్తానని జగ్గారెడ్డి అన్నారు. కొత్త పీసీసీ చీఫ్‌ను ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతున్న క్రమంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కూడా టీపీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్‌గానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.