కరోనా మరణాలపై అనుమానాలు ఉన్నాయి – ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Thursday, July 30th, 2020, 05:23:07 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగిపోతున్నాయి. అయితే అటు కేసుల విషయంలో, కరోనా మరణాల విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై తమకు అనుమానులున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే రోజుకు కనీసం 30 నుంచి 40 మంది కరోనా వలన చనిపోతున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే గాంధీలో కరోనా బాధితులకు సరిపడా స్టాఫ్ లేదని అక్కడ వైద్యులు, స్టాఫ్ నర్సుల సంఖ్య పెంచాలని, రూ.3 వేల కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేదల ప్రాణాలు పోతే ఎవరూ ప్రశ్నించరన్న ధీమాతో సీఎం కేసీఆర్ ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ మూలన కరోనా వచ్చినా గాంధీకే పంపిస్తున్నారని గాంధీలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని, ప్రతి జిల్లా ఆస్పత్రిలోనూ సిబ్బంది కొరత లేకుండా చూడాలని, ఆక్సిజన్, వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచాలని