ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణ లో కరోనా వ్యాప్తి – భట్టి విక్రమార్క!

Thursday, August 6th, 2020, 02:19:55 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తెలంగాణ లో కరోనా విపరీతంగా విజృంభిస్తోంది అని అన్నారు. తెలంగాణ లో మొదటగా పట్టణాల వరకు మాత్రమే పరిమితం అయిన కరోనా వైరస్, పల్లెలకు పాకింది అని అన్నారు. అయితే ఇలా జరగడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే అని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజా ఆరోగ్యాన్ని ఇంత దారుణంగా గాలికి వదిలేసిన ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎన్నడూ చూడలేదు అని అన్నారు.

కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టేందుకు కేంద్రం ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్షకాలను కాంగ్రెస్ పార్టీ నేతలను కట్టడి చేయడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకొంటుంది అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే గ్రామాల్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందటం తో గ్రామాల్లో, మండలాల్లో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు భట్టి విక్రమార్క. అంతేకాక దళితుల అణచివేత పై డీజీపీ కి ఫిర్యాదు చేసిన స్పందించలేదు అని, గవర్నర్ కి ఈ మెయిల్ చేశాం అని తెలిపారు. పొత్తి రెడ్డి పాడు ప్రాజెక్టు విషయం పై ఏపీ దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు అని అన్నారు.