దళిత వర్గాలకు ఆయన ఒక ఆశా జ్యోతి – టీపీసీసీ ఉత్తమ్

Tuesday, August 11th, 2020, 01:09:15 AM IST


మాజీ ఎంపీ నంది ఎల్లయ్య సంతాప సభలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేతలు పాల్గొన్నారు. అయితే అతని జీవిత కాలం లో అందించిన సేవలను టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్ స్థాయి నుండి ఆరు సార్లు లోక్ సభకు మరియు రెండు సార్లు రాజ్య సభకు ఎన్నిక అయ్యారు అని, అది ఆయన పార్టీకి, ప్రజలకు చేసిన సేవలకు నిదర్శనం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన జీవితం పార్టీ నాయకులకు ఆదర్శం అని, ఆయన సిద్ధాంతాలను, క్రమ శిక్షణ ను పార్టీ నేతలు అంతా కూడా ఆచరించాలి అని అన్నారు.

అయితే దళిత వర్గాలకు ఆయన ఒక ఆశా జ్యోతి అని,క్రమ శిక్షణ కి మారుపేరు అని, నిజాయితీ పరుడు అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాక పదవి కాలం లో కూడా వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా, ప్రజా సేవ కే అంకితమైన వ్యక్తి అని అన్నారు.