తెలంగాణ కాంగ్రెస్‌కు గ్రేటర్ ఎన్నికలకు ముందు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి, సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్య నారాయణ వంటి వారు పార్టీనీ వీడి బీజేపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. అయితే తాజాగా దివంగత మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ సీనియర్ నేత, మాజీమంత్రి డీకే అరుణ నేడు విక్రమ్ గౌడ్‌ను కలిసి బీజేపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విక్రమ్‌గౌడ్ కూడా బీజేపీలోకి వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేశాడు. రేపు సాయంత్రం నడ్డా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు.
అయితే విక్రమ్‌గౌడ్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. నేడు జాంబాగ్‌లోని విక్రమ్‌గౌడ్ కార్యాలయానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు వెళ్లి పార్టీ మారకూడదని కోరినట్టు తెలుస్తుంది. అయితే పార్టీలో తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, తన తండ్రి ముఖేష్‌గౌడ్ హాస్పిటల్లో ఉంటే పార్టీ నేతలు కనీసం పట్టించుకోలేదని విక్రమ్‌గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ నేతలు దామోదరరాజనర్సింహ, సీతక్క కూడా ఫోన్ చేసి విక్రమ్‌గౌడ్‌ను బుజ్జగించారని అయితే గౌరవం లేని చోట తాను ఉండలేనని తేల్చి చెప్పినట్టు సమాచారం. \