బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న విజయశాంతి..!

Thursday, November 12th, 2020, 09:10:40 PM IST

తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీనీ వీడి బీజేపీలో చేరబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాములమ్మతో భేటీ అవ్వడం, బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చిందని ఆసక్తికర ట్వీట్లు చేస్తుండడంతో ఆమె ఇక కాంగ్రెస్‌ను వీడడం ఖాయమైపోయింది.

అయితే ఇక దుబ్బాక ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడంతో రాములమ్మ పార్టీ మారడం ఖాయమైపోయిందని అందుకు ఆమె డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 14న ఆమె డిల్లీ వెళ్లనుందని అక్కడే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. అయితే ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీలోని పలువురు కీలక నేతలు కూడా బీజేపీ గూటికి చేరనున్నారని టాక్ వినిపిస్తుంది.