ఏ మాత్రం సిగ్గున్నా జగన్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..!

Thursday, June 4th, 2020, 03:02:47 AM IST


ఏపీ సీఎం జగన్ పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగుల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సందర్భంగా సిగ్గుంటే సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అయితే గతంలో నీలం సంజీవరెడ్డి, జనార్ధన్ రెడ్డిలను ఓ కేసులో కోర్టు మందలించిందని అప్పుడు వారు సీఎం పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం సిగ్గున్నా తక్షణం వైఎస్ జగన్ రాజీనామా చేయాలని అన్నారు.