కవితకు కంగ్రాట్స్ చెప్పిన సంపత్.. కానీ అల్టీమేట్ సెటైర్లు..!

Tuesday, October 13th, 2020, 05:47:56 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా గెలుపొందడంపై ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కంగ్రాట్స్ చెబుతూనే వ్యంగ్యంగా సెటైర్లు వేశారు. మీ కుటుంబ రాజకీయ నిరుద్యోగ సమస్య పరిష్కారం అయింది కదా, కనీసం ఇప్పుడైనా రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యను పట్టించుకోండని అన్నారు.

అంతేకాదు 16 నెలలు ఉద్యోగం లేకపోతే కవిత ఎంత మానసిక వేదనకు గురయ్యిందో మీకు తెలిసింది కదా, అయితే 66 నెలలుగా అలాంటి వేదన పడుతున్న లక్షలాది మంది నిరుద్యోగుల గురుంచి ఇప్పుడైనా ఆలోచించండి అంటూ కేటీఆర్‌కు, కవితకు మరియు కేసీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో మొత్తం 824 ఓట్లు ఉండగా 823 ఓట్లు పోలయ్యాయి. అయితే అందులో టీఆర్ఎస్‌కు 728 ఓట్లు రావడంతో కవిత ఘన విజయం సాధించారు.