సీఎం కేసీఆర్ ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు

Thursday, January 28th, 2021, 07:42:44 AM IST


ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల పై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయితే ఈ వ్యవహారం పై మరొకసారి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాల పై మోడీ కి అంత నమ్మకం ఉంటే ఎన్నికలకు వెళ్ళాలి అంటూ చెప్పుకొచ్చారు. ఆ చట్టాలను రద్దు చేయాలని రైతులు గత రెండు నెలలు గా చేస్తున్న ఆందోళన, నిరాశ, నిస్పృహ లతో నిందుకుంది అని, నిన్న ఘర్షణలకు దారి తీసింది అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఆ చట్టాల వలన కనీస మద్దతు ధర లేకుండా పోతుంది అని, అన్నదాత పరిస్తితి పెన్నం మీద నుండి పోయిలో పడ్డట్లు గా మారింది అంటూ చెప్పుకొచ్చారు.

తాజాగా హస్తినా లో చోటు చేసుకున్న పరిణామాలు ఎన్నో అనుమానాలకి తావిస్తోంది అని,ఘటనల పై ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ జీవన్ రెడ్డి అన్నారు. ఎర్రకోట లో జెండా వేసిన దీప్ సిద్దు మోడీ సన్నిహితుడు కావొచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అయితే దేశం లో ఇలాంటి పరిస్థితులు ఉంటే, తెలంగాణ లో ముందుగా ఈ చట్టాల ను అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ తహతహలాడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం కేసీఆర్ ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక మోడీ మరియు కేసీఆర్ ల మధ్య రహస్య ఒప్పందం ఏమిటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఢిల్లీ తరహా ఉద్యమాలు రాష్ట్రంలో పునరావృతం అవుతాయి అంటూ హెచ్చరించారు.